TikTok: టిక్ టాక్ పై మరోసారి కొరడా ఝుళిపించిన పాకిస్థాన్
- టిక్ టాక్ లో అభ్యంతకర కంటెంట్ ఉందంటూ ఫిర్యాదు
- విచారణ జరిపిన పెషావర్ హైకోర్టు
- టిక్ టాక్ ను బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు
- గత అక్టోబరులోనూ టిక్ టాక్ పై నిషేధం
- 10 రోజులకే పునరుద్ధరణ
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు పాకిస్థాన్ లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ చైనీస్ యాప్ పై పాక్ మరోసారి నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఓ ప్రైవేటు ఫిర్యాదు నేపథ్యంలో పెషావర్ హైకోర్టు టిక్ టాక్ ను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిక్ టాక్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ వ్యాప్తి చెందుతోందని ఆ ఫిర్యాదులో పేర్కొనగా, న్యాయస్థానం ఏకీభవించింది.
గత అక్టోబరులో ఇదే తరహా ఫిర్యాదులతో ప్రభుత్వం టిక్ టాక్ ను బ్లాక్ చేసింది. అయితే అభ్యంతరకర ఖాతాలను తొలగిస్తామని టిక్ టాక్ హామీ ఇవ్వడంతో, 10 రోజుల నిషేధం అనంతరం కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది. అయితే మరోసారి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.