Mera Ration APP: రేషన్ లబ్ధిదారుల కోసం ‘మేరా రేషన్’.. యాప్‌ను విడుదల చేసిన కేంద్రం

Govt launched mera ration app

  • దగ్గర్లోని రేషన్ దుకాణాలు, అందులో లభించే సరుకుల వివరాలు  
  • వలస కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం
  • ఆధార్/రేషన్ కార్డు నంబరు ద్వారా లాగిన్ అయ్యే అవకాశం

రేషన్ లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘మేరా రేషన్’ పేరిట సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. వలస కుటుంబాలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ యాప్ ద్వారా గతంలో లబ్ధిదారులు జరిపిన లావాదేవీలు, దగ్గరల్లోని రేషన్ దుకాణం, అందులో లభించే సరుకులు వంటి వాటిని ఈ  యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. అంతేకాదు, ‘వన్ నేషన్ వన్ రేషన్’ కార్డు కింద రేషన్ కార్డు పోర్బబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు ఉందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణి వ్యవస్థ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే తెలిపారు.


ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రేషన్‌కార్డు పోర్టబులిటీ విధానం అమల్లో ఉందని సుదాన్షు పేర్కొన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన ‘మేరా రేషన్’ యాప్‌లో ఆధార్, లేదంటే రేషన్ కార్డు నంబరు ద్వారా లాగిన్ కావొచ్చని వివరించారు.

  • Loading...

More Telugu News