Yashwant Sinha: కాందహార్ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు మమతా బెనర్జీ చేసిన త్యాగం మీకు తెలుసా?: యశ్వంత్ సిన్హా

Yashwant Sinha praises Mamata Banerjee

  • టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా
  • మమతా బెనర్జీపై ప్రశంసలు జల్లు
  • పోరాట యోధురాలు అని ప్రశంస

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి  మమత సాహసం గురించి ఆయన వివరించారు. 1999లో ఖాట్మండూ నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్ కు తరలిస్తున్న సమయంలో... విమానంలో బందీలుగా ఉన్న భారతీయులను వదిలి పెట్టాలని, వారి బదులుగా తనను బందీగా తీసుకోవాలని మమత అన్నారని చెప్పారు.

తొలి నుంచి కూడా ఆమె పోరాట యోధురాలేనని అన్నారు. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో మమతతో కలిసి తాను పని చేశానని చెప్పారు. విమానం హైజాక్ అయిన సమయంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందని... ఆ సమయంలో తాను బందీగా వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారని తెలిపారు. ఆమె గొప్ప త్యాగశీలి అని కొనియాడారు.

1999లో జరిగిన ఈ హైజాక్ ఘటన కలకలం రేపింది. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయకపోతే విమానంలోని ప్రయాణికులందరినీ చంపేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. దీంతో ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్, మసూద్ అజహర్ లను భారత ప్రభుత్వం విడుదల చేసింది.

  • Loading...

More Telugu News