SEC: మున్సిపల్ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అదనపు మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్ఈసీ

 SEC issued additional guidelines for Municipal votes counting
  • రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • రాత్రి 8 గంటల కల్లా కౌంటింగ్ పూర్తవ్వాలన్న ఎస్ఈసీ 
  • కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరించాలని స్పష్టీకరణ
  • వీడియో ఫుటేజిని ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని ఆదేశాలు
ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్ కు అనుమతించాలని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా చూడాలని ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజిని ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని స్పష్టం చేశారు.
SEC
Additional Guidelines
Counting
Municipal Elections
Andhra Pradesh

More Telugu News