Miryala Ravinder Reddy: టాలీవుడ్ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Court issues non bailable arrest warrant against Tollywood producer Miryala Ravinder Reddy
  • బాలయ్యతో సినిమా నిర్మిస్తున్న రవీందర్ రెడ్డి
  • గతంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రనిర్మాణం 
  • రవీందర్ రెడ్డి తనను మోసం చేశాడన్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్
  • తనకు రూ.50 లక్షలు ఇవ్వాల్సి ఉందని వెల్లడి
  • వారెంట్ జారీ చేసిన ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు
టాలీవుడ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఆయనపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మిర్యాల రవీందర్ రెడ్డి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో 'జయజానకీ నాయక', 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాలను నిర్మించారు.

ఏడేళ్లకిందట చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను రవీందర్ రెడ్డి తనకు ఇస్తానని చెప్పి, మాటతప్పారని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయగా, చీటింగ్ కేసు నమోదైంది. రవీందర్ రెడ్డి రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు చెల్లించలేదని ఆ డిస్ట్రిబ్యూటర్ ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగానే నిర్మాత రవీందర్ రెడ్డికి ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Miryala Ravinder Reddy
Non Bailable Warrant
Sahasam Swasagaa Sagipo
US Distributer
Cheating Case
Tollywood

More Telugu News