Sarad Pawar: అసోంను మినహాయిస్తే దేశంలో మిగతా చోట్ల బీజేపీ ఓడిపోతుంది: శరద్ పవార్ జోస్యం

Sarad Pawar comments on BJP chances in poll bound states except Assam
  • దేశంలో అసెంబ్లీ ఎన్నికల సందడి
  • మహారాష్ట్రలో మీడియాతో మాట్లాడిన శరద్ పవార్
  • కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ
  • ఫలితాలపై ఇప్పుడే మాట్లాడలేమని వెల్లడి
ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయవేత్త శరద్ పవార్ దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలంపై స్పందించారు. అసోంను తప్ప అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిగతా ప్రాంతాల్లో బీజేపీ ఓటమిని ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడ్డారు. పూణే జిల్లాలోని బారామతి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఓ సోదరిపై దాడి చేసేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు.

ఇక, ఇప్పుడప్పుడే ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడడం సరికాదని పవార్ అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల ప్రజలే నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. అయితే కేరళలో వామపక్షాలు తమతో కలిసి వస్తే స్పష్టమైన మెజారిటీ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Sarad Pawar
BJP
Assam
West Bengal
Tamilnadu
Kerala

More Telugu News