Telangana: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనే ఏదీ లేదు: తేల్చేసిన కేంద్రం
- పసుబోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్
- కేఆర్ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు కార్యాలయం వుందన్న మంత్రి
తనను గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.