Balloon: జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ విమానం ఆకారంలో ఉన్న బెలూన్ లభ్యం

PIA like balloon spotted in Jammu Kashmir again
  • పీఐఏ విమానం రూపురేఖలతో బెలూన్
  • మార్చి 9న సోత్రా చక్ గ్రామంలో బెలూన్ గుర్తింపు
  • తాజాగా అలాంటిదే భల్వాల్ ప్రాంతంలో లభ్యం
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • బెలూన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
జమ్మూకశ్మీర్ లో ఇటీవల పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) విమానం ఆకారంలో ఉన్న ఓ బెలూన్ తీవ్ర కలకలం రేపింది. తాజాగా అలాంటిదే మరో బెలూన్ లభ్యమైంది. రూపురేఖల్లో అచ్చం పీఐఏ విమానాన్ని తలపిస్తున్న ఈ బెలూన్ ను భల్వాల్ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 స్థానికులు అందించిన సమాచారంతో ఈ బెలూన్ ను గుర్తించారు. మార్చి 9వ తేదీన ఇలాంటి విమానం ఆకారం బెలూన్ ను హీరానగర్ సెక్టార్ లోని సోత్రా చక్ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Balloon
Jammu And Kashmir
PIA
Plane
Police
India
Pakistan

More Telugu News