Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 31 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 19 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.68 పాయింట్లు లాభపడ్డ ఏసియన్ పెయింట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 50,363కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 14,910 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (4.68%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.58%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.60%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.55%), భారతి ఎయిర్ టెల్ (1.48%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.40%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.22%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), ఎన్టీపీసీ (-0.81%).