Chiranjeevi: వచ్చే నెల నుంచి చిరంజీవి 'లూసిఫర్' షూటింగు

Chiranjeevi to start Lucifer shoot in next month
  • ప్రస్తుతం 'ఆచార్య' పూర్తిచేస్తున్న చిరంజీవి 
  • మోహన్ రాజాతో 'లూసిఫర్' రీమేక్
  • ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్
  • కీలక పాత్రలో ప్రముఖ నటి సుహాసిని  
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. దీని తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట.  ఈ క్రమంలో ముందుగా ఆయన మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ ను ప్రారంభిస్తారు.

తమిళ యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ 'లూసిఫెర్' రీమేక్ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను తాజాగా పూర్తిచేసినట్టు సమాచారం. దీంతో షూటింగు షెడ్యూల్స్ ను కూడా పక్కాగా వేస్తున్నట్టు చెబుతున్నారు. తొలి షెడ్యూలు షూటింగును వచ్చే నెల రెండో వారం నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.

స్క్రిప్టు విషయంలో దర్శకుడు మోహన్ రాజా మాతృకకు పలు మార్పులు చేర్పులు చేయగా, చిరంజీవి వాటికి వెంటనే ఓకే చెప్పారట. గతంలో చిరంజీవితో కలసి పలు సినిమాలలో కథానాయికగా నటించిన సుహాసిని ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.  
Chiranjeevi
Mohan Raja
Suhasini
Lucifer

More Telugu News