Arvind: పసుపు బోర్డు కంటే మెరుగైన స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్

BJP MP Arvind says Spice Extension Board is better than Turmeric Board
  • పసుపు బోర్డు ఏర్పాటుపై అరవింద్ పై విమర్శల దాడి
  • బదులిచ్చిన అరవింద్
  • ఎక్స్ టెన్షన్ బోర్డుతో ప్రయోజనాలున్నాయని వెల్లడి
  • చాలామంది రైతులు లాభపడుతున్నారని వివరణ
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో తనపై వస్తున్న విమర్శల దాడికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. పసుపు బోర్డు కంటే మెరుగైనది స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు అని వెల్లడించారు. ఎక్స్ టెన్షన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రమంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారని అరవింద్ వెల్లడించారు. స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు వల్ల ఇప్పటికే చాలామంది లాభపడుతున్నారని వివరించారు.

పార్లమెంటులో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయిందని, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు దాసోహమయ్యాడని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నాడని అరవింద్ ఆరోపించారు. ఉత్తమ్ చలవ వల్లే కాంగ్రెస్ చాలావరకు ఖాళీ అయిందని.... కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్రస్థాయిలో ఉత్తమ్ అధ్యక్షులుగా ఉంటే తమకెంతో లాభదాయకమని ఎద్దేవా చేశారు.
Arvind
Spices Extension Board
Turmeric Board
Nizamabad
Uttam Kumar Reddy
Rahul Gandhi
Revanth Reddy
KCR
Congress

More Telugu News