Counting: నేడు గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Counting for Guntur and Krishna districts Teachers MLC elections
  • ఈ నెల 14న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • 93.06 శాతం పోలింగ్ నమోదు
  • నేడు కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు
  • గుంటూరు ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు
ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ జరగనున్న గుంటూరు ఏసీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆదివారం జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 93.06 శాతం ఓట్లు పోలైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఓట్లు 13,505 కాగా... 12,556 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కోసం 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
Counting
Teachers MLC
Guntur District
Krishna Districta
Andhra Pradesh

More Telugu News