Aamir Khan: సోషల్ మీడియా నుంచి తప్పుకున్న తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్‌

Amir Khan Made interesting comments after exiting from the social media
  • తన విషయంలో మీడియా బాధ్యత పెరిగిందన్న సూపర్‌ స్టార్
  • తనకు, అభిమానులకు మధ్య మీడియానే వారధి అని వ్యాఖ్య
  • ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని వినతి
  • భవిష్యత్‌  అప్‌డేట్స్‌ తన ప్రొడక్షన్‌ బ్యానర్ ఖాతాలో వెల్లడి
సామాజిక మాధ్యమాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తున్నానంటూ కీలక ప్రకటన చేసిన బాలీవుడ్‌ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

అలాగే ఇకపై తనకు, అభిమానులకు మధ్య మీడియానే వారధిగా ఉండనుందని తెలిపారు. అందుకు మీడియా సంతోషించాలన్నారు. మీడియా బాధ్యత పెరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు. తాను మీడియాను ఎంతో విశ్వసిస్తానని.. ఎలాంటి ఊహాగానాలను తావివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం ‘కోయి జానే నా’ సినిమా చిత్ర ప్రదర్శనకు హాజరైన ఆయన బయటకు వచ్చే క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ చిత్రంలో ఆయన ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.  

సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకొంటున్నట్టు మంగళవారం ఆమిర్‌ ఖాన్‌ ప్రకటించారు. తన 56వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే సోషల్‌మీడియాకు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. తన పట్ల ప్రేమాభిమానాలు  చూపిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇదే నా ఆఖరి పోస్ట్‌’ అని పేర్కొంటూ సోషల్‌ మీడియా నుంచి నిష్క్రమిస్తున్నట్టు వెల్లడించారు. తన భవిష్యత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌ తన ప్రొడక్షన్‌ బ్యానర్ (akppl_official) అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు.
Aamir Khan
Bollywood
Social Media
Twitter

More Telugu News