Harish Rao: బడ్జెట్ ప్ర‌వేశపెట్టిన హ‌రీశ్ రావు.. తెలంగాణ బ‌డ్జెట్‌ రూ.2,30,825.96 కోట్లు

harish presents budget

  • రెవెన్యూ వ్య‌యం రూ.1,69,383.44 కోట్లు
  • ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్లు
  • పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్లు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు రూ.5 కోట్ల చొప్పున నిధులు
  • ముఖ్య‌మంత్రి ద‌ళిత్ సాధికార‌త‌కు రూ.1000 కోట్లు  

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర‌ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు బడ్జెట్ ప్ర‌వేశపెడుతున్నారు. ఈ బాధ్య‌త‌ను త‌న‌కు అప్ప‌గించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ అనేక రాష్ట్రాల‌ను ప్ర‌గ‌తిలో అధిగ‌మించింద‌ని చెప్పారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను అనుకున్న స‌మ‌యంలోగా పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. స‌మ‌స్య‌ల‌ను, స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా బ‌డ్జెట్ ఉంటుంద‌ని చెప్పారు.

రాష్ట్ర బ‌డ్జెట్ రూ.2,30,825.96 కోట్లు అని వెల్ల‌డించారు. రెవెన్యూ వ్య‌యం రూ.1,69,383.44 కోట్లు అని, మిగులు రూ.6,743.50 కోట్లు అని చెప్పారు. ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్ల‌ని, మూల‌ధ‌న వ్య‌యం రూ.29,046.77 కోట్లు అని తెలిపారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్ల కేటాయింపులు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు రూ.5 కోట్ల చొప్పున నియోజ‌క వ‌ర్గాల‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మొత్తం క‌లిపి రూ.800 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ముఖ్య‌మంత్రి ద‌ళిత్ సాధికార‌త‌కు రూ.1,000 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో యాంత్రీక‌ర‌ణ కోసం రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నామ‌న్నారు. క‌రోనా కార‌ణంగా ఎన్నో ఆర్థిక‌, ఆరోగ్య స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామ‌ని చెప్పారు. జీఎస్‌డీపీ భారీగా త‌గ్గింద‌ని తెలిపారు.  


 బడ్జెట్‌లో ఇత‌ర కేటాయింపులు..
  • ఎంబీసీ కార్పొరేష‌న్ కు రూ.1,000 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
  • మైనార్టీ సంక్షేమ శాఖ‌కు రూ.1,606 కోట్లు
  • మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ.3,000 కోట్లు
  • మ‌హిళ‌, శిశు సంక్షేమ శాఖ‌కు రూ.1,702 కోట్లు
  • రైతు బంధుకు రూ.14,800 కోట్లు
  • రైతుల రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు
  • వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ.25 వేల కోట్లు
  • ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌కు రూ.1,730 కోట్లు
  • నీటి పారుద‌ల శాఖ‌కు రూ.16,931 కోట్లు
  • స‌మ‌గ్ర భూస‌ర్వేకు రూ.400 కోట్లు
  • ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.11,728 కోట్లు
  • క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌కు రూ.2,750 కోట్లు
  • ఎస్సీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు
  • ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు
  • ఎస్టీ గృహాల‌కు రాయితీపై విద్యుత్ కు రూ.18 కోట్లు
  • మూడు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్ల కోసం రూ.3,000 కోట్లు
  • బీసీల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మికి అద‌నంగా రూ.500 కోట్లు
  • రైతుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
  • కొత్త స‌చివాల‌య నిర్మాణానికి రూ.610 కోట్లు
  • దేవాదాయ శాఖ‌కు రూ.720 కోట్లు
  • అట‌వీ శాఖ‌కు రూ.1,276 కోట్లు
  • ఆర్టీసీకి రూ.1,500 కోట్లు
  • మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు
  • ఓఆర్ఆర్ లోప‌ల కొత్త కాల‌నీల్లో తాగునీరు కోసం రూ.250 కోట్లు
  • వరంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు
  • ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు

  • Loading...

More Telugu News