Tractor: బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ వాడుతోన్న రైతు.. అందులో ఏసీ, జీపీఎస్, సీసీటీవీ!
- హర్యానాకు చెందిన రైతు వినూత్న ఆలోచన
- ఉత్తరప్రదేశ్‌తో హర్యానాకు జలవివాదం
- దాడులు, కాల్పుల నుంచి రైతుకు రక్షణ
- సరిహద్దు గ్రామంలో ఉంటోన్న రైతు
హర్యానాకు చెందిన ఓ రైతు బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్‌ను వాడుతున్నాడు.. ఉత్తరప్రదేశ్‌తో జలవివాదం ఉన్న నేపథ్యంలో దాడులు ఎదురైన సమయంలో తనకు గాయాలు కాకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నాడు.
హర్యానాలోని సోనీపట్ జిల్లా ఖరమపుర్ గ్రామం ఉత్తరప్రదేశ్‌కి సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య జల వివాదం నేపథ్యంలో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తనను తాను కాపాడుకోవడానికే ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించానని ఖరమపుర్ గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర తెలిపాడు. కొన్ని రోజుల క్రితం తన సోదరుడితో కలిసి పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తెలిపాడు.
ఆ సమయంలో కాల్పులు కూడా జరిపారని, అప్పుడు ఈ ట్రాక్టర్ కారణంగానే తాము సురక్షితంగా బయటపడ్డామని తెలిపాడు. ఇక ఆ ట్రాక్టర్ ను బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దడానికి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. అందులో సీసీటీవీ కెమెరాలతో పాటు ఏసీ, జీపీఎస్ సౌకర్యాలు కూడా ఉంటాయి.