Nitish Kumar: కరోనా పంజా.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం
- బీహార్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- వైద్య సిబ్బందికి వచ్చే నెల 5 వరకు సెలవులు బంద్
- ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తోన్న నితీశ్ ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. బీహార్ లో సైతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్ సర్కారు కరోనా వ్యాక్సినేషన్ ను ఉచితంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తోంది.