Kollu Ravindra: అయ్యో పాపం జగనన్న.. బొక్కబోర్లా పడ్డారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra fires on Jagan after High Court gives stay in Chandrababu case
  • చంద్రబాబుపై బురద చల్లుదామని బొక్కబోర్లా పడ్డారు
  • కోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తినడానికి సిగ్గులేదా?
  • చంద్రబాబు ఆకాశంలాంటి వారు
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కేసు విచారణ సందర్భంగా... ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై వేసిన కేసులో స్పష్టమైన ఆధారాలుంటే చూపించాలని అన్నారు. ఈ కేసులో అరెస్ట్ తో పాటు, తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు వేశారు.

'అయ్యో పాపం జగనన్న.. చంద్రబాబుపై బురద చల్లుదామని బొక్కబోర్లా పడ్డారు' అని రవీంద్ర ఎద్దేవా చేశారు. కోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తినడానికి సిగ్గులేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు ఆకాశంలాంటి వారు... ఆయనపై ఉమ్మి వేయాలనుకుంటే అది మీ మొహంపైనే పడుతుంది... అర్థమైందా జగనాలు సారు' అని ట్వీట్ చేశారు.
Kollu Ravindra
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
CID
AP High Court

More Telugu News