Kamal Haasan: ఎంఎన్ఎం మేనిఫెస్టో విడుదల చేసిన కమలహాసన్... తమిళనాడును ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా మార్చుతామని వెల్లడి

Kamal Haasan releases MNM manifesto

  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హోరు
  • ప్రజల తలసరి ఆదాయం పెంచుతామన్న కమల్
  • మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని హామీ 
  • మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం  
  • యువతకు 50 లక్షల ఉద్యోగాలిస్తామన్న కమల్ 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ మేనిఫెస్టో విడుదల చేశారు. వచ్చే పదేళ్లలో తమిళనాడును ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. విద్యారంగంలో మరింతగా మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు.

తమిళనాడు ప్రజల ప్రస్తుత తలసరి ఆదాయం రూ.2.76 లక్షలు కాగా, దాన్ని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపారు. మహిళలు ప్రతి నెలా రూ.15 వేల వరకు సంపాదించుకునేలా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తామని, మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యువతకు 50 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News