Rammohan Naidu: విశాఖ ఉక్కును ఖతం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం: లోక్‌సభలో రామ్మోహన్ ‌నాయుడు

Center aims to kill vizag steel plant alleges rammohan naidu

  • ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామన్న భరోసా ప్రభుత్వ సంస్థలకు ఎందుకివ్వరు?
  • పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సు ఇంకా పెండింగులోనే
  • సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడండి

విశాఖ ఉక్కు పరిశ్రమను ఖతం చెయ్యాలనే లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుందని తెలుగుదేశం పార్టీ లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు-2021పై నిన్న లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.  సమస్యలుంటే చేయూత అందిస్తామంటూ ప్రైవేటు వ్యక్తులకు ఈ బిల్లులో భరోసా ఇచ్చారని, మరి అలాంటి భరోసా ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కుకు ప్రభుత్వ గనులు కేటాయించాలని 2007లో పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సు ఇప్పటికీ పెండింగులోనే ఉందన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ప్రతీ రాష్ట్రానికి ప్రతి అంశంలోనూ కొంత సమయం ఇవ్వాలని రామ్మోహన్‌నాయుడు కోరారు.

  • Loading...

More Telugu News