increments: ఆరు నెలల్లో రెండు సార్లు జీతాలు పెంచిన టీసీఎస్.. ఉద్యోగులు ఖుషీ!
- వచ్చేనెల నుంచే మళ్లీ జీతాల పెంపు
- వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీతాలను పెంచిన తొలి సంస్థ
- 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
- గత ఏడాది అక్టోబరులోనూ జీతాల పెంపు
భారత ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులందరి జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వ్యవధిలోనే టీసీఎస్ చేస్తున్న రెండో వేతన పెంపు ఇది. వచ్చేనెల నుంచే ఈ పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీతాలను పెంచిన తొలి సంస్థ టీఎస్ఎస్ కావడం గమనార్హం.
వేతనాలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించడంతో ప్రయోజనం పొందుతున్న 4.7 లక్షల మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్‌షోర్ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర పెంపు ఉంటుందని ఆ సంస్థ వివరించింది.
దీని వల్ల ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంటు ఉద్యోగులకు లభించినట్లు అయింది. గత ఏడాది అక్టోబరులోనూ టీసీఎస్ తమ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. వచ్చేనెల నుంచి పదోన్నతులను ఇవ్వనుంది.