India: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. వీక్షణలో ఐదేళ్ల నాటి రికార్డు బద్దలు

India vs England 2021 Test series registers highest viewership in 5 years
  • టెస్టు సిరీస్‌ను వీక్షించిన 10.3 కోట్ల మంది
  • నిమిషానికి సగటున 10.3 లక్షల వీక్షణలు
  • హోరాహోరీగా జరిగిన టెస్టు  సిరీస్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ టీవీ వీక్షణలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌ను 10.3 కోట్ల మంది వీక్షించారు. నిమిషానికి సగటున 10.3 లక్షల వీక్షణలు నమోదయ్యాయి. ఫలితంగా ఐదేళ్ల క్రితం నాటి వీక్షణల రికార్డు బద్దలైంది. రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగ్గా ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఈ సిరీస్‌లో విజయం సాధించిన జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉండడంతో అందరూ టెస్టు సిరీస్‌పై దృష్టి సారించారు.

దీనికి తోడు తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుని ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆ తర్వాత పుంజుకున్న భారత్ వరుస విజయాలతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. ఫలితంగా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
India
England
Test Series
TV Views

More Telugu News