AIADMK: స్టాలిన్ పైనా, ఆయన తనయుడిపైనా చర్యలు తీసుకోండి... 'అమ్మ'పై వ్యాఖ్యలు చేస్తున్నారు: ఈసీకి ఫిర్యాదు చేసిన అన్నాడీఎంకే

AIADMK complains on Stalin and Udayanidhi to EC

  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • జయలలిత మృతిపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ దర్యాప్తు
  • దర్యాప్తు సమయంలో వ్యాఖ్యలు చేస్తున్నారన్న అన్నాడీఎంకే
  • ధిక్కారం కింద వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని వినతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 'అమ్మ' జయలలితపై డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని అధికార అన్నాడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై ఓవైపు జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ దర్యాప్తు జరుపుతుండగా, స్టాలిన్, ఉదయనిధి ఆమెపై వ్యాఖ్యలు చేయడం ధిక్కారం కిందకు వస్తుందని అన్నాడీఎంకే తన ఫిర్యాదులో పేర్కొంది.

డీఎంకే నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లో విద్వేషాలు కలిగించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News