Ramchandar Rao: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి... పీఆర్సీపై లీకులు ఇచ్చారు: బీజేపీ నేత రాంచందర్ రావు

BJP MLC candidate Ramchandar Rao met election officer

  • తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎన్నికలు
  • ఓటమిపాలైన రాంచందర్ రావు
  • ఎన్నికల ప్రధాన అధికారితో భేటీ
  • టీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు
  • ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ

ఇటీవల ముగిసిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఓటమిపాలయ్యారు. తన పరాజయం నేపథ్యంలో రాంచందర్ రావు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, పీఆర్సీపై ముందే లీకులు ఇవ్వడం ద్వారా అధికారపక్షం ఉద్యోగులతో ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు చేతులు మారాయని అన్నారు. గూగుల్ పే, పేటీఎం యాప్ ల సాయంతో ఓటర్లకు నగదు పంపిణీ చేశారని వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని తెలిపారు.

  • Loading...

More Telugu News