Galla Jayadev: ఏపీపై కేంద్రం ఇప్పటికీ సవతి తల్లి ప్రేమే చూపుతోంది: గల్లా జయదేవ్

Galla Jaydev says Centre continues step mother attitude towards AP
  • పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకంపనలు
  • కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
  • హోదా ఇవ్వలేమన్న కేంద్రం
  • స్పందించిన గల్లా జయదేవ్
  • విభజన హామీలు నెరవేర్చడం కేంద్రానికి ఇష్టంలేదని వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టంగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.

ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమనే కొనసాగిస్తోందని విమర్శించారు. ఏపీఆర్ఏ అంశంపై తాము అడిగిన సాధారణ ప్రశ్నలకు సైతం బదులివ్వడానికి నిరాకరిస్తున్న కేంద్రం, అప్రాధాన్య అంశాలపై మాత్రం స్పందిస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరి చూస్తుంటే ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అనాసక్తిగానూ, అయిష్టంగానూ ఉన్నట్టు అర్థమవుతోందని గల్లా జయదేవ్ విమర్శించారు.
Galla Jayadev
Andhra Pradesh
Special Status
Lok Sabha
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam

More Telugu News