Sensex: బ్యాంకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- రుణాలపై మారటోరియం పెంచమని ఆదేశించలేమన్న సుప్రీంకోర్టు
- బ్యాంకుల షేర్ల అండతో నష్టాల నుంచి లాభాల్లోకి మరలిన మార్కెట్లు
- 280 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. రుణాల చెల్లింపులపై ఆర్బీఐ విధించిన ఆరు నెలల మారటోరియం సమయాన్ని పెంచమని తాము ఆదేశించలేమని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, బ్యాంకింగ్ షేర్లు లాభాల బాట పట్టాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్లు లాభపడి 50,051కి చేరుకుంది. నిఫ్టీ 78 పాయింట్లు పుంజుకుని 14,815 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 1.51 శాతం లాభపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.06), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.28), ఐసీఐసీఐ బ్యాంక్ (2.25), టైటాన్ కంపెనీ (2.06), యాక్సిస్ బ్యాంక్ (2.02).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.28), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.97), ఐటీసీ (-1.70), ఎన్టీపీసీ (-1.14), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.05).