CPI Ramakrishna: అలా చెప్పిన తర్వాత కూడా ఓట్లు అడిగేందుకు బీజేపీకి సిగ్గుండాలి: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

CIP Ramakrishna questions BJP over Tirupati LS Bypolls

  • ఎందుకెయ్యాలి ఓట్లు?
  • తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని హామీ నెరవేర్చనందుకా?
  • ఏపీకి పదేపదే అన్యాయం చేస్తున్నందుకా?
  • పవన్ ఇప్పటికైనా బీజేపీ నుంచి బయటకు వస్తే మంచిది

ఏపీ బీజేపీ నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసిందని, అటువంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరుపతిలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుకు ఓట్లు వెయ్యమని అడుగుతారా? అని దుమ్మెత్తిపోశారు. లేదంటే, ఏపీకి పదేపదే అన్యాయం చేస్తున్నందుకు ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్న బీజేపీని పవన్ కల్యాణ్ ఇప్పటికైనా విడిచిపెట్టాలని రామకృష్ణ హితవు పలికారు.

  • Loading...

More Telugu News