Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
- 871 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 265 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో పాటు... సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 871 పాయింట్లు నష్టపోయి 49,180కి పడిపోయింది. నిఫ్టీ 265 పాయింట్లు పతనమై 14,549కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఏసియన్ పెయింట్స్ (1.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.87%) షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా (-3.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.38%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.07%), ఐటీసీ (-2.75%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.