YS Sharmila: షర్మిల సభకు లైన్ క్లియర్.. అనుమతి నిచ్చిన పోలీసుశాఖ!
- ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల భారీ బహిరంగసభ
- దాదాపు లక్ష మందితో సభను నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు
- కోవిడ్ నిబంధనలను పాటించాలన్న పోలీసులు
తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీకి సంబంధించిన తొలి బహిరంగసభకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సభకు పోలీసులు అనుమతించారు. ఈ సభను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టు షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభలోనే పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాలను షర్మిల ప్రకటించనున్నారు.
ఖమ్మం సభకు అనుమతించిన పోలీసులు... కరోనా నేపథ్యంలో కొన్ని షరతులు విధించారు. సభకు వచ్చే వారంతా శానిటైజర్లు తెచ్చుకోవాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దాదాపు లక్ష మందితో సభను నిర్వహించేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగుతానని షర్మిల తన అనుచరులతో చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన తండ్రి వైయస్సార్ కు పులివెందుల ఎలాగో... తనకు పాలేరు అలాగేనని ఖమ్మం జిల్లా నేతలతో ఆమె చెప్పినట్టు సమాచారం.