KP Shankar: నియోజకవర్గ ప్రజలతో సరదాగా బాక్సింగ్ చేసిన డీఎంకే అభ్యర్థి... వీడియో ఇదిగో!

DMK candidate KP Shankar boxing in his election campaign
  • తమిళనాడులో ఎన్నికల సందోహం
  • ప్రచారంలో తలమునకలుగా ఉన్న అభ్యర్థులు
  • తిరువొత్తియూర్ నుంచి పోటీచేస్తున్న కేపీ శంకర్
  • శంకర్ డీఎంకే అభ్యర్థి.. బాక్సింగ్స్ గ్లోవ్స్ తో ప్రచారం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రతి ఓటు అమూల్యమే. ఒక్క ఓటు తేడాతో తలరాతలు మారిపోతుంటాయి. అందుకే ఓటర్లను ఆకట్టుకోవడానికి నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మొన్నటికిమొన్న తమిళనాడులో ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బట్టలు కూడా ఉతికాడు. తాజాగా తమిళనాడులోనే కేపీ శంకర్ అనే అభ్యర్థి తన బాక్సింగ్ ప్రావీణ్యాన్ని నియోజకవర్గ ప్రజల ముందు ప్రదర్శించారు.

శంకర్ తిరువొత్తియూర్ అసెంబ్లీ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేతులకు బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని సరదాగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజలతో బాక్సింగ్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ప్రొఫెషనల్ బాక్సర్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో పంచ్ లు, అప్పర్ కట్ లతో హుషారెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయి అందరినీ ఆకర్షిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
KP Shankar
Election Campaign
Tiruvottiyur
DMK
Tamilnadu

More Telugu News