Thailand: 67 ఏళ్ల వృద్ధుడి పొట్టలో 59 అడుగుల నులిపురుగు.. నోరెళ్లబెట్టిన వైద్యులు

59 foot long tapeworm discovered inside mans intestines

  • కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 67 ఏళ్ల వృద్ధుడు
  • పచ్చి మాంసాన్ని తినడం వల్ల నులిపురుగులు ఏర్పడే ఛాన్స్  
  • గత 50 ఏళ్లలో థాయిలాండ్‌లో ఇదే పెద్దదన్న వైద్యులు

67 ఏళ్ల వృద్ధుడొకరు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్న భారీ నులిపురుగు (టేప్‌వార్మ్)ను చూసి నోరెళ్లబెట్టారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన.

ఈ సందర్భంగా అతడి మలంలో 28 నులిపురుగు గుడ్లను కూడా గుర్తించారు. అనంతరం ఆ భారీ నులిపురుగును మలద్వారం ద్వారా బయటకు పంపేందుకు మందులు ఇచ్చారు. దీంతో అది కాస్తా బయటకు వచ్చింది. దాని పొడవు 59 అడుగులు (18 మీటర్లు) ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

పచ్చి మాంసాన్ని, సరిగా ఉడకని ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్టలో ఇలా నులిపురుగులు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని బాధితుడికి సలహా ఇచ్చారు. అంతేకాదు, ఎందుకైనా మంచిదని అతడి కుటుంబ సభ్యులను కూడా పరీక్షలు చేయించుకోమని సూచించారు. గత 50 ఏళ్లలో థాయిలాండ్‌లో బయటపడిన అతి పెద్ద నులిపురుగు ఇదని వైద్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News