Ramnath Kovind: స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు
- కోవింద్ కు ఛాతీలో అసౌకర్యం
- ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స
- రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- పరిశీలనలో ఉంచామని వెల్లడి
- ఇటీవలే కొవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రపతికి వైద్య పరీక్షలు చేసిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, పరిశీలనలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఆసుపత్రిలో చేరకముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రథమ పౌరుడు అబ్దుల్ హమీద్ కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోవింద్ ఈ నెల మొదట్లోనే కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రెండో డోసు వేయించుకోవాల్సి ఉంది.