Banks: రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు.. బ్యాంకులు పనిచేసేది రెండు రోజులే

Banks open just 2 days between March 27 and April 4
  • ఏప్రిల్ 4 వరకు బ్యాంకులు మూత
  • మధ్యలో పనిచేసేది రెండే రోజులు
  • మార్చి 30, ఏప్రిల్ 3 మినహా సెలవులు
రేపటి నుంచి (మార్చి 27) మొదలు ఏప్రిల్ 4 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు రాబోతున్నాయి. మధ్యలో రెండు రోజులు తప్ప మిగతా రోజులన్నీ బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు బ్యాంకు సెలవుల గురించి వెబ్ సైట్ లో వివరాలు పెట్టింది.

నాలుగో శనివారం కావడంతో మార్చి 27న బ్యాంకులకు సెలవు. మార్చి 28 ఆదివారం, మార్చి 29 హోలీ కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. ఇక, ఏప్రిల్ 1న కేవలం ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలు తప్ప.. సామాన్యులకు సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4న ఆదివారం కావడంతో ఆ రోజులూ బ్యాంకులు బంద్ అవుతాయి.

మధ్యలో మిగిలింది మార్చి 30, ఏప్రిల్ 3వ తేదీల్లో మాత్రమే బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి. పాట్నాలో అయితే మార్చి 30న కూడా బ్యాంకులకు సెలవు దినంగానే ప్రకటించారు. దీంతో నగదు లేదా చెక్ డిపాజిట్లపై పెద్ద ప్రభావం పడనుంది. అయితే, బ్యాంకులు మూతపడినా ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎలాంటి ఆటంకాల్లేకుండా సాగుతాయి.
Banks
Holiday
Holi
Fourth Saturday
Sunday

More Telugu News