KL Rahul: రాహుల్ సెంచరీ, పంత్ విధ్వంసం... మరోసారి భారీస్కోరు సాధించిన భారత్

Rahul ton and Pant fireworks helps India to set huge target in Pune

  • పూణేలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు
  • కేఎల్ రాహుల్ 108 పరుగులు
  • 40 బంతుల్లో 77 రన్స్ చేసిన పంత్

పూణేలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దులా చెలరేగారు. ఇటీవల టీ20 సిరీస్ లో దారుణంగా విఫలమై ఓపెనర్ స్థానం నుంచి మిడిలార్డర్ కు మారిన కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటతీరు చూపిస్తూ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ మరోసారి ఇంగ్లండ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

రాహుల్ 114 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు. పంత్ కేవలం 40 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 77 పరుగులు సాధించడం విశేషం. అంతకుముందు కెప్టెన్ కోహ్లీ 66 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్య కూడా 4 సిక్సులు, ఒక ఫోర్ బాది 35 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే, టామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా, శామ్ కరన్, అదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 25, ధావన్ 4 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News