Spandana Portal: ఆధునికీకరించిన స్పందన పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

 CM Jagan inaugurated updated Spandana Portal

  • 2019లో స్పందన పోర్టల్ కు శ్రీకారం
  • ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పోర్టల్
  • అనేక సేవలకు నెలవు అంటూ ప్రభుత్వ ప్రచారం
  • తాజాగా మరికొన్ని అప్ డేట్లతో నవీకరణ

ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకువచ్చిన స్పందన పోర్టల్ ను మరింత ఆధునికీకరించారు. అనేక అప్ డేట్లతో పోర్టల్ కు కొత్త రూపు కల్పించారు. అన్నివిధాలా ముస్తాబైన సరికొత్త స్పందన పోర్టల్ ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పోర్టల్ సేవలను ఆన్ లైన్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పాలన మరింత సరళంగా సాగేందుకు వీలుగా, ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య ఓ వారధి ఉండాలన్న ఉద్దేశంతో 2019లో స్పందన పోర్టల్ కు రూపకల్పన చేశారు. ప్రజలు తమ అర్జీలను పంపుకునేందుకు, ఫిర్యాదులు చేసేందుకు ఈ స్పందన పోర్టల్ ద్వారా సాధ్యమవుతుంది. కరోనా సమయంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు పాసులను కూడా స్పందన పోర్టల్ ద్వారానే జారీ చేశారు.

  • Loading...

More Telugu News