Bollywood: హిందీ 'విక్రమ్‌ వేధ'లో హృతిక్‌, సైఫ్‌ అలీఖాన్‌

Hrithik Roshan Saif Ali Khan to appear in Vikram Vedha
  • తమిళంలో హిట్‌ అందుకున్న విక్రమ్‌ వేధ
  • సైఫ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో
  • హృతిక్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించే అవకాశం
  • హృతిక్‌కు‌ 25వ సినిమా
తమిళంలో భారీ హిట్‌ కొట్టిన 'విక్రమ్‌ వేధ' హిందీ రీమేక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌లు తలపడనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హృతిక్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా, సైఫ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అలరించనున్నాడన్న ఊహాగానాలు బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విక్రమ్‌ వేధ రీమేక్‌ కోసం హృతిక్‌ రోషన్‌ కసరత్తు సాగిస్తున్నాడట. జిమ్‌లో చెమటోడుస్తూ కఠిన ఆహార నియంత్రణలు పాటిస్తున్నాడని సమాచారం.

ఇది హృతిక్‌ 25వ సినిమా కూడా కావడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు మేకర్లు శ్రమిస్తున్నారు. తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్‌ను తనదైన శైలిలో పండించేందుకు హృతిక్‌ సంసిద్ధమవుతున్నాడని..  బాడీలాంగ్వేజ్‌, లుక్‌ పరంగా కసరత్తు చేస్తున్నాడని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్‌ వేధ హిందీ రీమేక్‌కు ఇంకా పేరు ఖరారు కాలేదు.‌ షూటింగ్‌ ఈ వేసవిలో ప్రారంభం కానుందని సమాచారం.
Bollywood
Hrithik Roshan
Saif ali khan

More Telugu News