India: భారత్​ కు వస్తున్న ఇజ్రాయెల్​ షిప్పుపై ఇరాన్​ క్షిపణి దాడి!

Israeli ship that survived missile attack reaches Mundra port in Gujarat

  • అయినా గమ్యాన్ని చేరిన నౌక
  • గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరిక
  • ఘటనపై భారత భద్రతా సంస్థల దర్యాప్తు

ఇజ్రాయెల్ నుంచి బయల్దేరిన ఆ ఓడ.. మార్గమధ్యంలో క్షిపణి దాడికి గురైంది. నౌకలోని కొంత భాగం బాగా దెబ్బతింది. మామూలుగా అయితే, క్షిపణి తగలగానే ఆ ఓడ తునాతునకలై సముద్రంలోనే మునిగిపోవాలి. కానీ, అది తన గమ్యస్థానాన్ని చేరింది. ఈ ఘటన అరేబియా సముద్రంలో జరిగింది. ఇజ్రాయెల్ లోని దార్ ఇస్ సలామ్ నుంచి బయల్దేరిన సరుకు రవాణ నౌక మౌంట్ లోరి.. గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.


కానీ, దారిలో గురువారం ఓ మిసైల్ ఆ నౌక మీదకు దూసుకొచ్చింది. దాంతో  షిప్పులోని కొంత భాగం దెబ్బతింది. అయినా కూడా దాని ప్రయాణం ఎక్కడా ఆగకుండా గమ్యం వరకు సాగింది. శుక్రవారం ముంద్రా పోర్టుకు వచ్చి ఆగింది. ఇరాన్ ఈ క్షిపణి దాడి చేసి ఉంటుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి గురించి ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వంగానీ, ఆ నౌకను నడుపుతున్న సంస్థగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.


ఈ దాడిపై భారత భద్రతా సంస్థలూ దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తుపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇజ్రాయెల్ షిప్పులో పేలుడు సంభవించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో జరిగిన ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. పేలుడుకు కారణం ఇరానేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News