ISRO: ఉపగ్రహంలో స్వల్ప సమస్య.. ప్రయోగం వాయిదా వేసిన ఇస్రో
- రేపు జరగాల్సిన జిశాట్1 ప్రయోగం
- ఏప్రిల్ 18కి వాయిదా వేశామన్న ఇస్రో వర్గాలు
- రెండో సారి వాయిదా పడిన జిశాట్1 ప్రయోగం
- అంతకుముందు కరోనా లాక్ డౌన్ తో వాయిదా
భూమిని అన్ని కోణాల్లోనూ చిత్రీకరించే ఉపగ్రహం జిశాట్ (జీఐఎస్ఏటీ)1 ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగ సమయాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్పులు చేసింది. జీఎస్ఎల్వీ ఎఫ్10 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సన్నద్ధమైంది. ఇప్పటికే రాకెట్ లోకి ఉపగ్రహాన్ని చేర్చింది. ఆదివారం (మార్చి 28న) ప్రయోగం జరగాల్సి ఉంది.
అయితే, ఉపగ్రహంలో చిన్న లోపం రావడంతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 18న ప్రయోగం నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈ వాయిదాతో రెండోసారి ప్రయోగం వాయిదా పడినట్టయింది. అంతకుముందు గత ఏడాది మార్చి 5నే ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించాలనుకుంది. కానీ, కరోనా కారణంగా ప్రయోగం వాయిదా పడింది. ఉపగ్రహం ద్వారా భారత ఉపఖండాన్ని రియల్ టైంలో పరిశీలించేందుకు వీలవుతుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉపగ్రహం బరువు 2,268 కిలోలు.