Kinjarapu Ram Mohan Naidu: రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు వినతిపత్రం సమర్పించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

TDP MP Rammohan Naidu met Union Railway minister Piyush Goyal
  • ఢిల్లీలో పియూష్ గోయల్ ను కలిసిన రామ్మోహన్
  • శ్రీకాకుళంలో మరిన్ని రైళ్లను ఆపాలని విజ్ఞప్తి
  • వైజాగ్-శ్రీకాకుళం-వారణాసి ప్రత్యేక రైలును ప్రకటించాలని విన్నపం
  • తిరుమల ఎక్స్ ప్రెస్ ను శ్రీకాకుళం నుంచి నడపాలంటూ వినతి
టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. వైజాగ్ నుంచి శ్రీకాకుళం మీదుగా వారణాసికి ప్రత్యేక రైలును ప్రకటించాలని, వైజాగ్ నుంచి తిరుపతి మీదుగా కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలును శ్రీకాకుళం నుంచి బయల్దేరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

శ్రీకాకుళంలో మరిన్ని రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ రైల్వే జోన్ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న రైల్వే వ్యవస్థల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వేమంత్రికి రామ్మోహన్ ఓ వినతిపత్రం అందించారు.
Kinjarapu Ram Mohan Naidu
Piyush Goyal
Railway Minister
Srikakulam
Express Trains

More Telugu News