Telangana: ఏప్రిల్ 10 వరకు తెలంగాణలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ

Telangana govt imposes strict measures

  • తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ
  • రానున్నది పండుగల సీజన్
  • మాస్కులు తప్పనిసరి చేస్తూ సర్కారు ఆదేశాలు
  • ర్యాలీలు, యాత్రలపై నిషేధం
  • పండుగ వేడుకలపైనా ఆంక్షలు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలకు తెరదీసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. రానున్నది పండుగల సీజన్ కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10 వరకు రాష్ట్రంలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది.

ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం ప్రకటించింది. హోలీ, రంజాన్, ఉగాది, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమి వేడుకలపైనా ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News