england: అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇక వర్తించదు... బీసీసీఐ కీలక నిర్ణయం!

No Field Umpire Soft Signal in IPL says BCCI
  • ఇంగ్లండ్ తో సిరీస్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలపై విమర్శలు
  • ఐపీఎల్ నిబంధనల ప్రకారం కొత్త నిర్ణయం
  • సొంతంగా నిర్ణయం ప్రకటించనున్న థర్డ్ అంపైర్
ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆటగాళ్లు అవుటా? నాటవుటా? అన్న విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్ లో ఫీల్డ్ లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్ లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. అయితే, గ్రౌండ్ లో ఉన్న అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ గా అవుట్ ను ప్రకటించడంతో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించాడు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో ఐపీఎల్ లో ఇటువంటి తప్పులు చోటు చేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్ తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.

england
India
Cricket
Soft Signal
BCCI
IPL 2021

More Telugu News