Team India: అందుకే రెండో మ్యాచులో ఓడిపోయాం: బౌలర్ ప్రసిద్ధ్
- మరింత బాగా బౌలింగ్ చేస్తే బాగుండేది
- పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది
- 44వ ఓవర్లలోనే ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలోనూ రాణించాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బౌలింగ్‌ను మెరుగ్గా ఆరంభించేందుకే ఇష్టపడతానని తెలిపాడు. మైదానంలో కొత్త బంతితో మరింత ఉత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అయితే, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సమర్పించుకున్నానని చెప్పాడు.
దీంతో ఆ విషయంలో మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బెయిర్‌స్టో, స్టోక్స్ కలిసి తమ బౌలింగ్‌లో ధాటిగా ఆడారని తెలిపాడు. ఆ మ్యాచులో తాము మరింత బాగా బౌలింగ్ చేస్తే బాగుండేదని చెప్పాడు. వారిద్దరు తమ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టారని తెలిపాడు.
ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిందని తెలిపాడు. టీమిండియా 330కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బాగా రాణించి 44వ ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించారని ఆయన చెప్పాడు.