Gorantla Butchaiah Chowdary: టీడీపీ బలోపేతానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలి: బుచ్చయ్య చౌదరి

TDP Senior Leader Gorantla Butchaiah Chowdary says Jr NTR should work for party
  • రాజమండ్రిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
  • హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • పార్టీకి గ్రౌండ్ రియాలిటీ నాయకత్వం రాబోతుందని వెల్లడి
  • పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి క్షేత్రస్థాయిలో వాస్తవికతతో కూడిన నాయకత్వం రాబోతుందని తెలిపారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోకి రావాలని, అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

గత 40 ఏళ్లుగా టీడీపీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని, ఇకపై పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రం అప్పులకుప్పగా మారుతుంటే, మరోవైపు వైసీపీ సర్కారు వైజాగ్ లో మరో రాజధాని కడుతోందని విమర్శించారు. ఒక రాజధానికే దిక్కులేకపోతే మరో రాజధాని ఏంటని అన్నారు. అభివృద్ధి అనేది ఆమడదూరంలో నిలిచిపోయిందని విమర్శించారు.
Gorantla Butchaiah Chowdary
Jr NTR
TDP
Andhra Pradesh

More Telugu News