YV Subba Reddy: జ‌ర్న‌లిస్టుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్

YV Subareddy starts vaccination programme for journalists
  • వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన చెవిరెడ్డి
  • జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉండాలన్న సుబ్బారెడ్డి
  • ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచన
జర్నలిస్టుల కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే... వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించగలుగుతారని చెప్పారు.

జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయించేందుకు చెవిరెడ్డి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని సుబ్బారెడ్డి అన్నారు. కరోనా మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని... మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
YV Subba Reddy
TTD
Vaccination
Journalists

More Telugu News