Corona Virus: కరోనా కేసులు పెరుగుతున్న వేళ... తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ!

Low Rush in Tirumala

  • నిన్న 45 వేల మందికి దర్శనం
  • హుండీ ఆదాయం రూ.2.50 కోట్ల  
  • ఏప్రిల్ లో తిరుమలలో పలు వేడుకలు

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండగా, తిరుమలపైనా ఆ ప్రభావం పడింది. ముందుకు ప్రత్యేక దర్శనం టికెట్లను పొందిన వారు కూడా తిరుమలకు వచ్చేందుకు నిరాసక్తంగా ఉన్నట్టు కనిపిస్తుండటం, సర్వదర్శనం టోకెన్ల కోటాను తగ్గించడంతో భక్తుల సంఖ్య పల్చగా ఉంది.

నిన్న స్వామివారిని దాదాపు 45 వేల మంది దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.50 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ లో తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాలకూ ఏర్పాట్లు చేశామని, ఉగాదికి ముందు అణివార ఆస్థానం, ఉగాది, ఆపై శ్రీరామనవమి తదితర వేడుకలకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News