Mahipal Reddy: మందు కొట్టిన ఉన్మాది చర్యకు... కేపీహెచ్బీ ఏఎస్ఐ మహీపాల్ రెడ్డి కన్నుమూత!

ASI Mahipal Reddy Who Face Injuries in Drunking Drive Testing Died Today
  • ఈ నెల 27న గాయపడ్డ మహీపాల్ రెడ్డి
  • మద్యం తాగి వస్తూ ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్
  • ఈ ఉదయం ఆసుపత్రిలో కన్నుమూత
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ, ఓ ఉన్మాది చేసిన చర్యకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏఎస్ఐ మహీపాల్ రెడ్డి కన్నుమూశారు. ఈ నెల 27న నిజాంపేట రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో, అప్పటికే మందు కొట్టి, అదే రహదారిపై వస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్ అతన్ని ఢీకొట్టాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహీపాల్ రెడ్డిని, ఆసుపత్రికి తరలించినా, ఆయన ప్రాణాలు మిగల్లేదు. ఈ ఉదయం పరిస్థితి విషమించి ఆయన మరణించారు. మహీపాల్ రెడ్డి అవయవాలను దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఆయన అంత్యక్రియలు నేటి సాయంత్రం స్వగ్రామంలో జరుగనున్నాయి. మహీపాల్ మరణంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.
Mahipal Reddy
Died
Drunk Driving

More Telugu News