Vijayasai Reddy: కనీసం ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కూర్చీ ఎక్కుతాడట: విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai Reddy comments on Pawan Kalyan
  • పవన్ సీఎం అవుతారన్న సోము వీర్రాజు
  • సీఎం సీటు ఆఫర్ చేస్తున్న పార్టీకి ఒక్క సీటు కూడా లేదన్న విజయసాయి
  • దాన్ని తీసుకునే పార్టీకి కనీసం ఉనికి కూడా లేదని ఎద్దేవా
ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ చర్చకు దారితీశాయి. వపన్ కు బీజేపీ అధిష్ఠానం పెద్దపీట వేయబోతోందా అనే దిశగా విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకుండానే ఆయన సెటైర్లు వేశారు.

ఇప్పుడు జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నికని... అలాంటప్పుడు కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటని విజయసాయి ఎద్దేవా చేశారు. సీఎం సీటును ఆఫర్ చేస్తున్న పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదని అన్నారు. దాన్ని తీసుకునే పార్టీకి కనీసం ఉనికి కూడా లేదని చెప్పారు. జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిందట... కనీసం ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట అని సెటైర్ వేశారు.
Vijayasai Reddy
YSRCP
Pawan Kalyan
Somu Veerraju
BJP
Janasena

More Telugu News