Jagan: కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జగన్‌ శంకుస్థాపన

jagan lays foundation stone to build retaining wall

  • రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్‌‌ నిర్మాణం
  • కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులకు చెక్
  • కనకదుర్గమ్మ‌ వారధి నుంచి కోటినగర్‌ వరకు వాల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు విజయవాడ కృష్ణలంక మూడో దశ రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేశారు. రూ.125 కోట్లతో ఈ వాల్‌‌ను నిర్మించనున్నారు.  కృష్ణా నది వరదల వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దీన్ని నిర్మిస్తున్నారు.  విజయవాడ కనకదుర్గమ్మ‌ వారధి నుంచి కోటినగర్‌ వరకు 1.5 కిలోమీట‌ర్ల‌ పొడవున ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ రిటైనింగ్‌ వాల్ ను నిర్మిస్తారు.

కృష్ణా నదికి భారీ వరదలు వస్తూ 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న నేప‌థ్యంలో ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్‌ వాల్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ శంకుస్థాప‌న‌ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పేర్ని వెంకట్రామయ్య, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, కొడాలి నానితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News