Aadhar Card: పాన్, ఆధార్ అనుసంధానం గడువు మరోమారు పెంపు

Dead Line For Aadhar Linking Extended
  • నిన్నటితోనే ముగిసిన గడువు
  • ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు
  • ఫిర్యాదులు రావడంతో మరో మూడు నెలల పెంపు
పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే గడువును కేంద్రం మరోమారు పొడిగించింది. నిజానికి ఈ గడువు నిన్నటితో ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో సాంకేతికపరమైన ఇబ్బందుల కారణంగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించుకోలేకపోతున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పొడిగించిన గడువులోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కోరింది. కాగా, పాన్, ఆధార్ అనుసంధానం గడువును ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది జులై 31 నుంచి 31 మార్చి 2021 వరకు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Aadhar Card
Pan Card
Income Tax
Dead Line

More Telugu News