Tirupati LS Bypolls: తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై జేడీయూ ఫిర్యాదు.. తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి

JDU leader complain against tirupati bjp candidate ratnaprabha

  • రత్నప్రభపై ఐదు కేసులు పెండింగులో ఉన్నాయి
  • కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఆమె సమర్పించలేదు
  • ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలి

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న రత్నప్రభపై జేడీయూ నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రత్నప్రభ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారని, కానీ నిజానికి ఆమెపై ఐదు కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సైఫాబాద్‌, ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై పెండింగులో ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రత్నప్రభపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను చక్రధర్‌బాబుకు అందించారు. అలాగే, రత్నప్రభ తన నామినేషన్ పత్రంతో కులధ్రువీకరణ పత్రాలను సమర్పించలేదని, కాబట్టి ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు.

అయితే, రత్నప్రభపై చేసిన ఆరోపణలను జేడీయూ నేత రమణ నిరూపించలేకపోయారని, దీంతో ఆమె నామినేషన్‌ను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News