Harbhajan Singh: ఇతరుల అభిప్రాయం నాకు అనవసరం: హర్భజన్

I dont want others opinion says Harbhajan singh

  • నేను ఇంకా ఆడాలనుకుంటున్నాను
  • ఈ వయసులో ఎలా సక్సెస్ కావాలో నాకు తెలుసు
  • కుటుంబం కోసమే గత ఐపీఎల్ నుంచి తప్పుకున్నా

తాను ఏంటనేది ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఇంకా ఇతనెందుకు ఆడుతున్నాడని చాలా మంది తన గురించి అనుకుంటుంటారని... అయితే, తాను ఇంకా ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. ఇతరుల అభిప్రాయాలతో తనకు అవసరం లేదని అన్నాడు. తనకంటూ కొన్ని ప్రమాణాలను నెలకొల్పుకున్నానని... వాటిని అందుకోకపోతే తనను తాను నిందించుకుంటానని చెప్పాడు. తన వయసు 20 కాదని, 40 ఏళ్లని... ఈ వయసులో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో తనకు తెలుసని అన్నాడు.

హర్భజన్ సింగ్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడాడు. ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నాడు. తన కుటుంబం కోసమే గత ఐపీఎల్ నుంచి తప్పుకున్నానని హర్భజన్ తెలిపాడు. దుబాయ్ లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కరోనా ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయని... అందుకే స్వదేశానికి వచ్చేశానని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నానని తెలిపాడు.

కరోనాకు వ్యాక్సిన్ రావడంతో ఈ ఐపీఎల్ లో ఆడమని తన భార్య కూడా ప్రోత్సహించిందని భజ్జీ చెప్పాడు. క్రికెట్ పోటీలో పాల్గొని చాలా రోజులు అయినప్పటికీ... ఎలా ఆడాలో తనకు తెలుసని అన్నాడు. కోల్ కతాకు మంచి ఆటగాళ్లు ఉన్నారని... రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని చెప్పాడు.

  • Loading...

More Telugu News